తాజాగా ఆస్ట్రేలియా టూర్ లో ఘనవిజయం సాధించిన భారత్ ఇక స్వదేశంలో సత్తా చాటనుండి. ఇండియా లో జరగబోతున్న ఈ సిరీస్ వివరాలు విడుదల చేశారు. ఈ సిరీస్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 13 వరకు ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఇండియాలో పర్యటించనుంది. ఈ టూర్ లో భాగంగా భారత్-ఆసీస్ ల మధ్య రెండు టీ20లు, ఐదు వన్డేలు జరగనున్నాయి. ఇందులో ఒక టీ20 విశాఖపట్నంలో, ఒక వన్డే హైదరాబాదులో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది.
టీ20 షెడ్యూల్ :
ఫిబ్రవరి 24 – తొలి టీ20 – బెంగళూరు
ఫిబ్రవరి 27 – రెండో టీ20 – విశాఖపట్నం
వన్డే షెడ్యూల్ :
మార్చి 2 – తొలి వన్డే – హైదరాబాద్
మార్చి 5 – రెండో వన్డే – నాగపూర్
మార్చి 8 – మూడో వన్డే – రాంచీ
మార్చి 10 – నాలుగో వన్డే – మొహాలీ
మార్చి 13 – ఐదో వన్డే – ఢిల్లీ