నిర్భయ దోషులకు ఈ నెల 20న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తాజా వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ నిర్భయ దోషులు ఉరి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక పర్యాయాలు పిటిషన్ల పేరుతో మరణశిక్ష అమలును ఆలస్యం చేసిన దోషులు తాజాగా మరో ప్రయత్నం చేశారు.
దోషి వినయ్ శర్మ తన శిక్ష తగ్గించాలంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ను అభ్యర్థించాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసులో తాను అనుభవించిన జైలు శిక్ష తనలో ఎంతో పరివర్తన తీసుకువచ్చిందని తెలిపారు. తన కుటుంబ పరిస్థితిని కూడా చూడాలని గవర్నర్ ను అభ్యర్తించాడు.