కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక తనపై కేసులు పెట్టారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన మీద ఉన్న కేసులన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని తెలిపారు. చంద్రబాబు, ఆయన బినామీలు అమరావతి చుట్టుపక్కల భూములు కొనుగోలు చేసి తర్వాత రాజధాని ప్రకటించారని జగన్ తెలిపారు. ల్యాండ్‌పూలింగ్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని మండిపడ్డారు.
శాఖల వారీగా రివ్యూలు చేసి అన్నింటిని బయటపెడతానన్నారు. రాజధాని భూముల కుంభకోణం బయటికి రాబోతోందని జగన్ తెలిపారు. కుంభకోణాలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించి ఆ సొమ్మును తిరిగి రాబడుతామనివెల్లడించారు. తక్కువ ఖర్చులకు పనిచేసేవారికే పనులు అప్పగిస్తామని తెలిపారు. దేశం మొత్తం ఏపీవైపు చూసేలా పనిచేస్తానని అన్నారు. తాను ఏపీకి ధర్మకర్తగా వ్యవహరిస్తా నని ఆయన స్పష్టం చేశారు.
సీఏఏ అనేది మత సంఘర్షణలకు దారి తీసే దుశ్చర్య: కేరళ సీఎం