telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ లో దారుణం.. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లిన దుండగులు

Crime

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పటేల్‌నగర్‌లోనివాసముంటున్న నవదంపతులపై దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. భర్తపై దాడి చేసి భార్యను ఎత్తుకెళ్లారు. దాదాపుగా 15 మంది అగంతకులు ఇంట్లోకి చొరబడి కిడ్నాప్ చేశారు. నెలరోజుల క్రితమే రాజు, బిందు ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య కిడ్నాప్‌పై రాజు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. అయితే ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని అంబర్‌పేట పోలీసులు సూచించారు. భార్య బంధువులే కిరాయి రౌడీలతో కిడ్నాప్‌ చేయించి ఉంటారని భర్త వాపోయాడు.

Related posts