వల్లభనేని వంశీతో డ్రామా ఆడించింది వైసీపీనే అని టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను చంద్రబాబు భక్తుడినని చెప్పారు. పార్టీలో ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా తాను మాత్రం ఉంటానని తెలిపారు. మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్రబాబును వల్లభనేని వంశీ విమర్శించడం సరికాదని అన్నారు.
దేవినేని అవినాశ్ పార్టీ మారడం చాలా తప్పు అని వెంకన్న అన్నారు. టీడీపీలో సరైన గౌరవం దక్కలేదని అవినాశ్ ఆరోపించారని కానీ, ఆయనకు తెలుగు యువత పదవి, గుడివాడ టికెట్ ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలని చెప్పారు.
టీఆర్ఎస్ను ఎప్పటికైనా గద్దె దించేది తామే: ఉత్తమ్