telugu navyamedia
తెలంగాణ వార్తలు

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కల నెర‌వేర‌దు ..

ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని కేసీఆర్ జాతీయ రాజకీయాలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు .

కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. ఆయన దగ్గర డబ్బులున్నాయి కాబట్టి పార్టీ పెట్టుకోవచ్చని సీఎం అన్నారు. ఆ డబ్బులకు మూలం ఎక్కడన్నదే సందేహని ఆయన అన్నారు

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జోత్సవాలను తిలకించేందుకు వచ్చిన బిస్వంత శర్మ శుక్రవారం నాడు  సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలో మ‌రో 30 ఏళ్ల వరకు బీజేపీ అధికారంలో ఉంటుందన్న ఆయన… విప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ క‌ల నెర‌వేర‌ద‌ని స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ నయా నిజాం మాదిరిగా పాలన చేస్తున్నాడన్నారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఇప్పటికే కలసి ఉన్నాయని..కొత్తగా కేసీఆర్ ప్రతిపక్షాలను కలిపేదేముంటుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో తమకు విపక్షం కానే కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ తెలంగాణ ప్రజ‌ల విశ్వాసాన్ని కోల్పోయార‌ని ఈ విష‌యాన్ని గ్రహించిన కేసీఆర్ జాతీయ రాజ‌కీయాలంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు

దేశంలో ఎంతమంది జట్టుకట్టినా దేశ ప్రజల మన‌సులో మాత్రం నరేంద్ర మోడీ ఉన్నారని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రజలు నిజాం పాలనను కోరుకోవడంలేదని విమర్శించారు. 

 

Related posts