జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయానికి బ్రేక్ పడింది… ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం… ఇవాళ్టి నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం అయ్యింది.. ఈ నేపథ్యంలో… మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది… జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు.. శివారులోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఎక్కడ చూసినా.. గత రెండు రోజులుగా భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి… ఇక, ఇవాళ మాత్రం భారీ ఎత్తున మీసేవ కేంద్రాలకు తరలివచ్చారు వరద బాధితులు.. గోల్కొండ పీఎస్ పరిధిలో మీసేవ కేంద్రం దగ్గర క్యూలైన్‌లో నిలబడి ఓ మహిళ మృతిచెందిన ఘటన కూడా వెలుగు చూసింది. అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో పేర్కొంది.
previous post
next post
ఎన్టీఆర్ చాలా మారిపోయాడు… శ్రియ కామెంట్స్