telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

బాయ్ ఫ్రెండ్ కోసం ఆ కసాయి తల్లి ఏం చేసిందంటే…?

CRime

జెన్నిఫర్ మారిసల్ అనే 26 ఏళ్ళ యువతికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే యువతికి మరో బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధం ఉంది. అతని కోసం కన్న పిల్లలకు నరకం చూపిస్తుండేది. బాయ్‌ఫ్రెండ్‌పై తనకున్న ప్రేమను చాటిచెప్పడానికని జెన్నిఫర్ ఏడాది వయసున్న కూతురి కాలు గోరును పీకేసింది. ఈ ఘటనను వీడియో తీసి తన బాయ్‌ప్రెండ్‌కు పంపింది. ఇలా పసిపాపకు నరకం చూపిస్తూ రాక్షసానందం పొందుతూ వస్తోంది. జెన్నిఫర్ తీసిన వీడియో ఆమె భర్త కంటపడడంతో తన భార్యపై అధికారులకు ఫిర్యాదు చేశాడు. వీడియోను చూసిన అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌పై ప్రేమతోనే ఇలా చేసినట్టు తెలిపింది. కేవలం ఇదే కాకుండా తన పిల్లలను మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నట్టు తెలిసిందని బిడ్డల తండ్రి చెప్పుకొచ్చాడు.

Related posts