telugu navyamedia
రాజకీయ వార్తలు

క్యాబినెట్​లో మహిళలకు స్థానం కల్పించండి: జ్రీవాల్‌కు మహిళా కమిషన్ లేఖ

kejriwal on his campaign in ap

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ జ్రీవాల్‌కు జాతీయ మహిళా కమిషన్ గురువారం లేఖ రాసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ మంత్రి మండలిలోకి ఒక్క మహిళను కూడా తీసుకోలేదు. దాంతో, సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు వచ్చాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 239(5)ను సవరించి ఢిల్లీ మంత్రి మండలిలో కనీసం ఒక్క మహిళా సభ్యురాలికైనా చోటు కల్పించాలని కోరుతూ ఎన్‌సీడబ్ల్యూలో పిటిషన్ దాఖలైంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌సీడబ్ల్యూ చైర్‌‌పర్సన్‌… కేజ్రీవాల్‌కు లేఖ రాశారు.

అన్ని రంగాల్లో మహిళలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో, నాయకత్వాన్ని పంచుకోవడం సమానత్వం ఉండాలని లేఖలో పేర్కొన్నారు. విధానపర నిర్ణయాల్లో తమ అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం మహిళలకు ఇవ్వాలన్నారు. అందుకోసం కనీసం ఇద్దరు మహిళలనైనా క్యాబినెట్‌లోకి తీసుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించారు.

Related posts