telugu navyamedia
సినిమా వార్తలు

హృతిక్, టైగర్ లపై అర్జున్ కపూర్ కామెంట్స్… ఫ్యాన్స్ ఫైర్

Arjun-Kapoor

బోనీ కపూర్ తనయుడిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఈ యంగ్ హీరో తనకన్నా 11 సంవత్సరాలు పెద్దదైన మలైకాతో నడుపుతున్న ప్రేమాయణంతో వార్తల్లో నిలిచాడు. అర్జున్ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన కోస్టార్స్, ఇతర నటీనటుల్ని సోషల్ మీడియా వేదికగా ఆటపట్టిస్తుంటాడు. తాజాగా అర్జున్ కపూర్ చేసిన ఓ కామెంట్ మాత్రం హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రస్తుతం హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలసి నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ వార్ చిత్రానికి సిద్దార్థ్ ఆనంద్ దర్శకుడు. టైగర్ ష్రాఫ్ తాజాగా ఇంస్టాగ్రాంలో ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో టైగర్, హృతిక్ కింద కూర్చుని ఉండగా సిద్దార్థ్ ఆనంద్ మాత్రం వారి పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్నాడు. దీనిపై అర్జున్ కపూర్ “ఒక లెజెండ్… ఇద్దరు సాధారణ నటులు” అని కామెంట్ చేశాడు. దీంతో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ అభిమానులు అర్జున్ కపూర్ ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. కానీ అర్జున్ కపూర్ అభిమానులు మాత్రం ఆ ఫోటోపై ఫన్నీగా చేసిన కామెంట్ తప్ప అందులో అగౌరవపరిచే ఉద్దేశం లేదని తమ హీరోను సమర్థిస్తున్నారు.

 

View this post on Instagram

 

I got your back sir @hrithikroshan and hopefully hes @itssiddharthanand got ours! 😋🤪 #onemonthtogo #2ndoct #war #hrithikvstiger

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) on

Related posts