telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పెళ్ళి విషయం దాచి ఇద్దరితో హీరో నిర్వాకం.. బండారం బయటపెట్టిన మాజీ ప్రియురాలు

Amrita-Dhanoa

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 13లో అర్హాన్ ఖాన్, రష్మి దేశాయ్ అనే ఇద్దరు బుల్లితెర నటులు పాల్గొన్నారు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే బిగ్‌బాస్ షోలోనే రష్మిని పెళ్లి చేసుకుంటానని అర్హాన్ వెల్లడించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ నేపథ్యంలో అర్హాన్ కు ఇదివరకే పెళ్ళి అయ్యిందని, పిల్లాడు కూడా ఉన్నాడని చెప్పి వారిద్దరి రిలేషన్‌షిప్‌లో బాంబ్ పేల్చాడు సల్మాన్. ఈ విషయం తెలిసి అర్హాన్ మాజీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అమృతా ధనోవా మీడియా ముందుకు వచ్చారు. అర్హాన్ తనను కూడా మోసం చేశారని తెలిపారు. ‘‘నేను అర్హాన్ ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నాం. ఏడాది పాటు అతను కనిపించుకుండా పోయాడు. ఆ తర్వాత ఓ రోజు అతని నుంచి ఫోన్ వచ్చింది. తనకు పెళ్లైపోయిందని ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నానని చెప్పాడు. ఆ తర్వాత జోక్ చేశానని అన్నాడు. కానీ ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ అర్హాన్‌కు పెళ్లై, ఓ బిడ్డ ఉన్నాడని బిగ్ బాస్ షోలో చెప్పాడో అప్పుడు నాకు అసలు విషయం తెలిసింది. నాకు తెలిసి అతను 2011లో పెళ్లి చేసుకున్నాడు. ఓసారి అర్హాన్ నా నుంచి రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఇప్పటివరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. నేను అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టాను. తన కెరీర్‌లో ఎదగడానికి అమ్మాయిలను వాడుకునే వ్యక్తి అర్హాన్. ఇప్పటివరకు అతను ఆడవాళ్లను వాడుకుంటూనే వచ్చాడు’ అని తెలిపారు. ఇక అర్హాన్ ప్రముఖ దర్శకుడు, రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ‘శ్రీవల్లి’ సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Related posts