*ఏపీలో పెరగనున్నఆర్టీసీ ఛార్జీలు..
*పేరిగిన ఛార్జీలు ధరలు రేపటి నుంచి అమల్లోకి..
ఏపీలో సామాన్యల బతుకు భారంగా తయారైంది. ఒక వైపు నిత్యావసర ధరలు మండుతున్నాయి. మరోవైపు విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు. తాజాగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచారు.
డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని ఆర్టీసీ ఎండీ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్ సెస్ కింద పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు.
ఉపయోగంలో లేని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. కార్గో సేవల ద్వారా కూడా ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటామని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.
కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానం కల్పిస్తారా?