telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

భూమా అఖిలప్రియ కేసులో కొత్త ట్విస్ట్…

bhuma akhila priya

బోయిన్‌పల్లిలో ముగ్గురి కిడ్నాప్‌ తెలుగు రాష్ట్రాల్లో చర్చగా మారింది.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వారిని సురక్షితంగా ఇంటికి చేర్చారు.. ఇక, కిడ్నాప్‌నకు పాల్పడినవారు.. వారిని ప్రేరేపించినవారు ఇలా లింక్‌లు లాగి అందరినీ అరెస్ట్ చేస్తున్నారు.. ఈ కేసులో టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఈ లాండ్ వ్యవహారంలో పెద్ద ఎత్తున ఏవీ సుబ్బారెడ్డి లాభం పొందినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.. 2016లో సర్వే నెంబర్ 80లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ప్రవీణ్ కుమార్.. అదే భూమి తమదంటూ లిటిగేషన్‌ పెట్టారు ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ, భార్గవరామ్.. ఈ భూ వివాదంపై పలు సార్లు చర్చలు జరిగాయి.. ఈ చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి డబ్బులు చెల్లించారు ప్రవీణ్ రావు.. ఈ సెటిల్‌మెంట్ విషయం తెలిసి భగ్గుమన్న అఖిలప్రియ.. భూమి విషయంలో తమతో కాకుండా ఏవీ సుబ్బారెడ్డితో ఎలా ఒప్పందం కుదుర్చుకుంటారని బెదిరింపులకు దిగారు.. మొదటి ఒప్పందం ప్రకారం కాకుండా పెరిగిన భూమి విలువ ప్రకారం మరికొన్ని డబ్బులు చెల్లించాలని ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వేరు వేరుగా ప్రవీణ్ రావుని డిమాండ్ చేశారు.. డిమాండ్ చేసిన ఎక్కువ డబ్బులను చెల్లించడానికి ప్రవీణ్ రావు నిరాకరించారని పేర్కొన్నారు పోలీసులు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts