telugu navyamedia
రాజకీయ

కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీ కోటా ర‌ద్దు..

*కేంద్రీయ విద్యాల‌యాల్లో ఎంపీ కోటా ర‌ద్దు..
*ఎంపీ కోటాను ర‌ద్దు చేస్తూ కేంద్ర‌ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ..
*ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కో ఎంపీకి 10 సీట్లు కేటాయింపు..

కేంద్రీయ విశ్వ విద్యాల‌యాల్లో ఎంపీ కోటాను కేంద్ర‌ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది . ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అన్ని విద్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్కో ఎంపీకి ఏడాదికి 10 సీట్లు కేటాయించారు. లోక‌స‌భ ఎంపీలు అయితే వాళ్ల నియోజ‌క‌వ‌ర్గంలో వినియోగించుకోవ‌చ్చు. రాజ్య‌స‌భ ఎంపీ అయితే దేశంలో ఎక్క‌డైనా ఆ కోటాను వినియోగించుకోవ‌చ్చు. గతంలో ఎంపీకి 6 సీట్లు మాత్ర‌మే ఉండేవి..ఇటీవ‌ల అవి కాస్త 10సీట్లుకు పెంచారు.

అయితే, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం పార్ల‌మెంట్ లో ఎంపీ కోటాలో 30 సీట్లు పెంచాలంటూ వేడి వాడి చ‌ర్చ‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో కోటా మొత్తం రద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఎంపీలు, విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రీయ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

Related posts