telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఆంధ్రాలో రెండో విడత రైతు భరోసా…

cm jagan

ఆంధ్ర ప్రదేశ్ లో రెండో విడత రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. వరుసగా రెండో ఏడాది రైతులకు పెట్టుబడి సాయం, ఇన్‌ పుట్ సబ్సిడీని అందించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రెండు విడతల్లో 11 వేల 500  రూపాయలను.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ ఏడాది 50 లక్షల 50 వేల మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. మొత్తంగా పదకొండు వందల 15 కోట్ల రూపాయలను.. రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతీ మూడిళ్లలో ఓ రైతు కుటుంబానికి పెట్టుబడి సాయమందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే జూన్, జులై ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు..ప్రభుత్వం పరిహారమందించింది. లక్షా 66 వేల మంది రైతుల ఖాతాల్లోకి .. 135 కోట్ల రూపాయలు జమ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఏ సీజన్‌లో పంటనష్టపోతే, అదే సీజన్‌లో పరిహారమివ్వడం.. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. రైతు తన కాళ్లపై తాను నిలబడే ఉద్దేశ్యంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచేలా వైఎస్సార్ జలకళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం జగన్.  ఉచితంగా బోర్లు వేయడం, మోటార్లు అందించడం ద్వారా.. రైతన్న తన కాళ్లపై తాను నిలబడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. వర్షాలు కురిసి ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయన్నారు.

Related posts