ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రాజధాని పోరులో మరో ఇద్దరు రైతులు మృతి చెందారు. వెలగపూడికి చెందిన అబ్బూరి అప్పారావు (55) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. రాజధాని నిర్మాణానికి ఆయన ఏడు ఎకరాల భూమి ఇచ్చాడు. అమరావతి తరలింపుపై కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నాడు. మనోవేదనతోనే ఆయన మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు.
మరోవైపు, మందడంలో బెజవాడ సామ్రాజ్యమ్మ అనే రైతు గుండెపోటుతో మృతి చెందింది. రాజధాని కోసం ఆమె 20 ఎకరాల భూమి ఇచ్చింది. రాజధానిని తరలిస్తున్నారన్న ఆందోళనతోనే ఆమె మృతి చెందినట్లు ఆమె బంధువులు చెప్పారు. ఆమె కుమారుడు గోపాలరావును పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

