telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క చిన్నప్పటి ఫోటోలు… వైరల్

Anushka-Sharma

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇటీవల కాలంలో సినిమాలను బాగా తగ్గించింది. షారూక్ ఖాన్‌తో నటించిన “జీరో” తర్వాత ఇప్పటివరకు అనుష్క మరో సినిమాకు ఓకే చెప్పలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వివాహానికి ముందు తన గ్లామరస్ ఫోటోలను, బికినీ ఫోటోలను రెగ్యులర్‌గా సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసేది. కానీ వివాహం తర్వాత అందాల ఆరబోతకు దూరమైంది. ప్రస్తుతం సినిమాలకు కూడా దూరంగా ఉంది. దీంతో అనుష్క సినిమాలకు దూరమవుతోందంటూ వార్తలు వస్తున్నాయి. సినిమాల‌తో కాక‌పోయిన‌ప్ప‌టికి ఏదో ఒక వార్త‌తో మాత్రం ఈ అమ్మ‌డు వార్త‌ల‌లో నిలుస్తుంది. నిన్న అనుష్క త‌న భ‌ర్త విరాట్‌ చేతికి ముద్దు ఇచ్చి హెడ్‌లైన్స్‌లో నిల‌వ‌గా, ఈ రోజు త‌న చిన్న‌నాటి ఫోటోల‌తో అంద‌రి దృష్టి ఆకర్షిస్తుంది. అంత‌కముందు విరాట్‌తో క‌లిసి బీచ్‌లో బికినీల‌తో ఫోటోలు దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అనుష్క శ‌ర్మ రీసెంట్‌గా చైల్డ్‌హుడ్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

Related posts