telugu navyamedia
సినిమా వార్తలు

“సైరా”లో అనుష్క పాత్ర ఇదే ?

Anushka

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం “సైరా న‌ర‌సింహారెడ్డి”. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, జ‌గ‌ప‌తి బాబు వంటి టాప్ స్టార్స్ న‌టిస్తున్నారు. అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా చిత్రం విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. అనుష్క కూడా ఈ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో ఝాన్సీ ల‌క్ష్మీబాయి పాత్ర‌లో అనుష్క క‌నిపించ‌బోతోందట‌. నిజానికి చరిత్ర ప‌రంగా ఉయ్య‌ల‌వాడ న‌ర్సింహారెడ్డికి, ఝాన్సీ ల‌క్ష్మీబాయికి సంబంధ‌మే లేదు. అయితే ఉయ్య‌ల‌వాడ క‌థ‌ను ఝాన్సీ ల‌క్ష్మీబాయి పాత్ర‌తో చెప్పించార‌ట‌. అంటే న‌ర్సింహారెడ్డి క‌థ‌ను లక్ష్మీబాయి పాత్ర‌లోని అనుష్క చేత చెప్పించార‌న్న‌మాట‌. ఈ సినిమా విడుదల కోసం మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts