telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బెల్ బాటమ్” టీజర్

Bell-Bottom

బాలీవుడ్ ఖిలాడీ, స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ హీరోగా రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బెల్‌బాటమ్’. వాణీ కపూర్‌, లారాదత్తా, హూమాఖురేషి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం 1980 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందింది. ఇందులో అక్షయ్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నారు. వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్‌ అద్వానీ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాండమిక్‌ సమయంలో చిత్రీకరణను పూర్తి చేసుకున్నఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 2, 2021లో విడుదల చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను అక్షయ్‌ కుమార్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు. కాగా కోవిడ్‌ ప్రభావంతో ఆరు నెలల పాటు షూటింగ్స్ ఆగిపోయాయి. షూటింగ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగానే ముందుగా విదేశాలకు వెళ్లారు హీరో అక్షయ్‌ కుమార్‌. ఇప్పుడు విడుదలైన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. మీరు కూడా ఈ చిత్రం టీజర్ ను వీక్షించండి.

Related posts