telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఖిలాడీ సినిమా మరో అప్డేట్…

టాలీవుడ్ లో రవితేజా ఎప్పటికప్పుడు మాస్ ఎంట్రీలతో, డైలాగ్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంటాడు. అయితే కొత్త సంవత్సరానికి రవితేజ డబుల్ ధమాకా పేల్చాడు. ఒకవైపు క్రాక్ ట్రైలర్‌తో అందరికి సూపర్ ఎంటర్‌టైన్ చేశాడు. దాంతో పాటుగా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఖిలాడీ సినిమా పోస్టర్ విడుల చేసి అభిమానులకు పిచ్చెక్కించాడు. ఈ పోస్టర్‌లో రవితేజా రెండు గెటప్స్‌లో ఉన్నాడు. వాటిలో ఒకదానిలో అమాయకంగా ఉన్న రవితేజా మరొకదానిలో కన్నింగ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగింది. ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరని హీరోయిన్లుగా చేస్తున్నారు. డాక్టర్ జయంతీలాల్ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్‌లపై సత్యనారాయణ దీనిని నిర్మిస్తున్నారు.  ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి మరో టాలెంటెడ్ నటుడు చేరనున్నారు. అతడెవరో కాదండీ.. స్టార్ నటుడు ఉన్ని ముకుందన్. అతడు ఎక్కువగా మలయాళం సినిమాల్లో కనిపిస్తారు. అంతేకాకుండా అడపాతడపా తెలుగు, తమిళ సినిమాల్లో కూడా ఆయన కనిపిస్తారు. అతడు తాజాగా తెలుగులో.. ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్‌లో ఎన్టీఆర్ అన్న పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఈ టాలెంటెడ్ నటుడు ఖిలాడీ సెట్స్‌లో చేరనున్నారు. ఈ మేరకు అతడిని స్వాగతిస్తూ ఖిలాడీ టీం ఓఫోటోను విడుదల చేసింది. అయితే ఈ సినిమాలో అతడి పాత్ర గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ పాత్రపై క్లారిటీ కోసం కాస్త సమయం ఎదురుచూడాల్సిందే.

Related posts