telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఉద్యోగ సంఘాలతో ప్రభత్వ చర్చలు సఫలం..

*ఫిట్ మెంట్ 23 శాతం అదే కొనసాగుతుంది..

*అడిషనల్ క్వాంటం 70-74 వయసు వాళ్ళకు 7 శాతం..

* ఐఆర్ రికవరీ ఉపసంహరించుకుంటున్నాం..

*పదేళ్లకో సారి కాకుండా 5 ఏళ్లకే పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయం

*సీపీఎస్ రద్దు ప్రక్రియ మార్చ్ 21 కల్లా రూట్ మ్యాప్ తయారు..

*గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల కన్ఫర్మేషన్ జూన్ లోపు జరగాలి..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనను విరమించారు. పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘాలతో సుమారు ఏడు గంటలపాటు ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ క్రమంలోనే పీఆర్సీ సాధన సమితి తాము తలపెట్టనున్న సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.

అనంతరం మంత్రులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుందని, తమ డిమాండ్లకు అంగీకారం తెలిపిందని స్టీరింగ్ కమిటీ నేతలు చెప్పారు. ఈ క్రమంలో స్టీరింగ్ కమిటీ నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం అర్థరాత్రి నుంచి చేపట్టాల్సిన సమ్మె నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు.

స్టీరింగ్ కమిటీ సభ్యులు.. సీఎం జగన్ తో వర్చువల్ గా మాట్లాడారు. మంత్రుల కమిటీ అంగీకరించిన డిమాండ్లపై ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఒప్పంద పత్రాన్ని అధికారులు సీఎం జగన్ కు పంపారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు సీఎం జగన్ అంగీకారం తెలిపారు.

పీఆర్సీ ఆశించినంతగా లేకపోవడంతో అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగుల ఆవేదన గురించి మంత్రుల కమిటీ చర్చించిందన్నారు. అన్ని అంశాలపై లోతుగా చర్చించి ఏకాభిప్రాయంకి వచ్చామన్నారు

ఫిట్ మెంట్ 23 శాతం యధాతధంగా ఉండనుంది. అదేవిధంగా ఐఆర్ రికవరీ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు ఉద్యోగులు. త్వరలోనే పీఆర్సీ నివేదికను వెల్లడిస్తామని సజ్జల అన్నారు. పీఆర్సీ పాత పద్దతితో ఐదేళ్లుగా నిర్ణయించామని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ వర్తింపుపై విడిగా ఉత్తర్వులు జరీ చేశాం అన్నారు సజ్జల. జనవరి నుంచి కొత్త హెచ్ ఆర్ ఏ ను అమలు చేస్తామని తెలిపారు సజ్జల. అదేవిధంగా పాత పద్దతిలోనే సీసీఏ ను కొనసాగించనున్నారు.

గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయనున్నారు. అలాగే హెచ్ ఆర్ ఏశ్లాబ్స్ లో మార్పులు చేయనున్నారు. 50వేల జనాభా ఉన్న చోట 11 వేల సీలింగ్ తో 10 శాతం , 2 లక్షల జనాభా ఉన్న చోట 16శాతం హెచ్ ఆర్ ఏ, అదేవిదంగా సచివాలయ , హెచ్ వోడీల కు జూన్ 2024నాటికీ 24 శాతం, జిల్లా కేంద్రాల్లో 16శాతం హెచ్ ఆర్ ఏ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.

ఈ సందర్భంగా 4 జేఏసీల తరపున సమ్మె విరమించుకున్నట్టుగా ప్రకటించారు. నల్ల బాడ్జీలు ధరించి మంత్రుల కమిటీతో చర్చలకు హాజరైన పీఆర్సీ సాధన సమితి నాయకులు.. మీడియా సమావేశంలో వాటిని తొలగించి సమ్మెను విరమించారు.

 

Related posts