telugu navyamedia
రాజకీయ వార్తలు

రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే: అమిత్‌ షా

TDP Mla anitha comments Roja YCP

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు, సౌకర్యాలను కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలికమైనదే తప్ప అది శాశ్వతం కాదని హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. హోం మంత్రి అయ్యాక తొలిసారిగా అమిత్‌ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్రపతి పాలన నడుస్తోండగా జూలై 3కు ఆ గడువు ముగియనుంది.

దీంతో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించారు. జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళిక ప్రకటిస్తే, స్వేచ్ఛాయుత వాతావరణంలో పోలింగ్‌ జరుగుతుందని అమిత్‌ షా అన్నారు. ఆ భావజాలాన్ని కూడా మోదీ ప్రభుత్వం ఏ మాత్రం సహించదనీ అన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం లేని భద్రమైన దేశంగా భారత్‌ను మార్చడమే తమ లక్ష్యమని అమిత్‌ షా అన్నారు.

Related posts