telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్మూకశ్మీర్‌ పంచాయతీ బృందంతో అమిత్‌ షా భేటీ

amith shah bjp

ఆర్టికల్‌ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్‌ విభజన నేపథ్యంలో గత నెలరోజులుగా కశ్మీర్‌ లోయ లో నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ పంచాయతీ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో హోంశాఖ అధికారులతోపాటు, కశ్మీర్‌ డివిజినల్‌ కమిషనర్‌, ఇతర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పూల్వామా, కశ్మీర్‌, జమ్మూ, లధాక్‌ ప్రాంతాల ప్రజలు కూడా ఈ బృందంలో ప్రతినిధులుగా ఉన్నారు. అభివృద్ధి నిధులు కశ్మీర్‌లోని గ్రామ​ పంచాయతీలకు నేరుగా అందించడం, ఆ నిధులతో గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యల పై ఈ సామావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో అమిత్ షాతో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, హోం సెక్రటరీ ఏకే భల్లా, అడిషనల్ సెక్రటరీ జ్ఞానేశ్ కుమార్  పాల్గొన్నారు

Related posts