telugu navyamedia
సినిమా వార్తలు

డార్లింగ్‌.. నువ్వు లేక పోతే నేను లేను..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’. డిసెంబర్ 17న ఐదు భాషల్లో విడుదలైన పుష్ప‌ భారీ క‌లెక్ష‌న్స్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. బన్నీ చర్రితల్లో రికార్డ్‌ని క్రియేట్‌ చేస్తుంది.

‘పుష్పరాజ్‌’పాత్రలో బన్నీ ఊర మాస్‌ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో పుష్ప చిత్ర యూనిట్ థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

This Quality Of Allu Arjun Makes Him So Special

సుకుమార్​తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బ‌న్నీ కంటతడి పెట్టారు. సుకుమార్ లేకుంటే తాను లేనని ఉద్వేగంగా మాట్లాడారు. బన్నీ మాటలతో దర్శకుడు సుకుమార్ కూడా ఉద్వేగానికి లోనయ్యారు.

‘నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని చాలా తక్కువ మందికే వాడతాను. రైతుగా ఉన్న మా తాత(అల్లు రామలింగయ్య)సినిమాల్లోకి రాకపోతే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. కాబట్టి మా తాతగారికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సినిమాల్లో ఫస్ట్‌ నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి రుణపడి ఉన్నాను అనే మాట వాడతాను. ఆ తర్వాత నేను సుకుమార్‌కే ఆ మాటను వాడతాను.

నాకు సుకుమార్‌ అంటే అంత ఇష్టం నాకే తెలియదు.. ‘ఆర్య’ అయిపోయి నాలుగైదేళ్లు అయిన తర్వాత పరుగు సినిమా సమయంలో నేను ఒక కారు కొనుకున్నా. దాని ఖరీదు రూ.85లక్షలు. ఒక రోజు ఆ కారు స్టీరింగ్‌పై చేయి పెట్టి ‘ఇంతదూరం వచ్చానంటే ఎవరెవరు కారణమై ఉంటారా’ అని ఆలోచిస్తు్న్నా. నా మైండ్‌లో తట్టిన మొదటి వ్యక్తి సుకుమార్‌గారు. డార్లింగ్‌.. నువ్వు లేక పోతే నేను లేను.. ఆర్య లేదు.. మరేమీ లేవు.

పబ్లిక్‌లో భావోద్వేగానికి లోనవ్వకూడదు అనుకుంటాను కానీ, కుదరడం లేదు. స్టైలిష్‌ స్టార్‌ నుంచి ఐకాన్‌ స్టార్‌ చేసి, యావత్‌ భారతదేశం చూసేలా చేశారంటే నా కెరీర్‌కు సుకుమార్‌ ఎంత కంట్రిబ్యూషన్‌ ఇచ్చారో మాటల్లో చెప్పలేను” అని బన్నీ కంటతడి పెట్డాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సుకుమార్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts