తెలంగాణలో న్యూఇయర్ కు మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు ప్రత్యేక అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది చివరిరోజున మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు కూడా అనుమతి ఇచ్చింది.
మద్యం దుకాణాలు డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకే తెరిచేందుకు అనుమతిస్తామని.. బార్స్, ఈవెంట్స్, టూరిజం హోటల్స్ రాత్రి ఒంటి గంట వరకు అనుమతిస్తామని పేర్కొంది. అయితే, ఈ సమయంలో.. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కాగా..రెండురోజుల క్రితం న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతుల ఇవ్వడం చర్చగా మారింది..
ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా … కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు విపత్తు నిర్వహణచట్టం కింద ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయనుంది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు.
తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణలు చెప్పాలి -కేటీఆర్