28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం నేడు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ కోర్ట్ సంచలన తీర్పును వెలువరించింది. సీబీఐ తన ఆరోపణలను నిరూపించలేకపోయిందని తెలిపింది.
నిందితులను దోషులుగా తేల్చేందుకు ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. సీబీఐ కోర్టు తీర్పుపై విభిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు కోర్టు తీర్పును స్వాగతిస్తుండగా… మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాబ్రీ మసీదు తీర్పుపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. న్యాయాన్ని భూస్థాపితం చేశారు. సరికొత్త భారత్’ అని ట్వీట్ చేశారు.
నా రేటు డిసైడ్ చేయడానికి ఆ హీరో ఎవరు..? : తాప్సి ఫైర్