telugu navyamedia
సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న “అక్షర” టీజర్

Akshara

ఒకవైపు హార్రర్ చిత్రాలతో మరోవైపు సస్పెన్స్ చిత్రాలలో నటిస్తూ నటిగా మంచి పేరు సంపాదించుకుంది నందితా శ్వేతా. తాజాగా నందితా శ్వేతా ప్రధాన పాత్రలో చిన్ని కృష్ణ దర్శకుడిగా తెరకెక్కుతున్న చిత్రం “అక్షర”. అజయ్ ఘోష్, మధునందన్, షకలక శంకర్, సత్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది టీజర్లో. ఇందులో అజయ్ ఘోష్, మధునందన్, షకలక శంకర్, సత్య ఫ్రెండ్స్ కాగా… వారి జీవితంలోకి ఓ టీచర్ ప్రవేశిస్తుంది. అయితే అనుకోకుండా వారు ఆమెను చంపాలనుకుంటారు. అందుకోసం ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఈ టీజర్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థమవుతోంది. మీరు కూడా ఈ టీజర్ ను ఒకసారి వీక్షించండి.

Related posts