telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో వివాదంలో చిక్కుకున్న వనిత

Vanitha

తమిళ నటుడు విజయ్ కుమార్ కూతురు వనిత మూడో పెళ్లి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుస వివాదాలతో సతమతమవుతున్న వనిత తాజాగా మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. కొన్నాళ్ల క్రితం వనిత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో కనీసం 10 మంది నాయకులు కూడా లేని బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని.. ఆ పార్టీలో తన తండ్రి విజయ్ కుమార్ కీలక నేతను అంటూ బిజీగా ఉన్నాడని కామెంట్స్ చేసింది.గతంలో ఈ వీడియోను రానివ్వలేదు . ఇప్పుడు ఈ వీడియో బయ్యటకు రావడంతో హాట్ టాపిక్ గా మారింది. వనిత వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో బీజేపీ నాయకులు ఆమెను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.

Related posts