telugu navyamedia
సినిమా వార్తలు

బోని కపూర్ పై కేసు నమోదు… రూ.2.5 కోట్ల క్రికెట్ ఫ్రాడ్

Boney-Kapoor

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దివంగత శ్రీదేవి భర్త బోనికపూర్ పై చీటింగ్ కేసు నమోదైంది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహణ విషయంలో ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి బోనికపూర్ తో పాటు మరికొందరిపై ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే… ప్రవీణ్ 2018లో పవన్ జంగిద్ అనే వ్యక్తి అతడిని కలిశాడట. త్వరలో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నామని, ఈ ఈవెంట్ లో బాలీవుడ్ సినీ తారలందరూ తరలివస్తారని తెలిపాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనికపూర్ సహా మరికొంతమంది ఈ ఈవెంట్ కోసం భాగస్వాములవుతున్నారని తెలిపాడు. నీవు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తే నీ పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని తెలిపాడు.

ఆయన చెప్పిన కొన్ని రోజుల తర్వాత బోనికపూర్ మీడియా సమావేశం నిర్వహించి జైపూర్ లో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. దీంతో అతను చెప్పింది నిజమే అని నమ్మిన ప్రవీణ్ శ్యామ్తా 67 లక్షలు, తన స్నేహితుడు 32 లక్షలు పెట్టుబడిగా పవన్ జంగిద్ కు ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఇంతవరకు సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మాత్రం జరగలేదు. దీనితో తన డబ్బు తనకు ఇచ్చేయాలని అడిగితే కుదరదని పవన్ జంగిద్ అంటున్నాడని ప్రవీణ్ శ్యామ్ వాపోతున్నాడు. పవన్ జంగిద్, బోణీకపూర్ మాటలు నమ్మే తాను వారికీ డబ్బు ఇచ్చానని తనతో పాటు 2.5 కోట్ల రూపాయల మొత్తంలో మరికొందరు మోసపోయినట్లు ప్రవీణ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో ప్రాధమిక విచారణ ప్రారంభించారు. అవసరమైతే బోనికపూర్ ని కూడా విచారిస్తామని అంటున్నారు పోలీసులు.

Related posts