అడివి శేష్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘మేజర్’.. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా.
శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా… కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అయితే దేశంలోని పలు నగరాల్లో ఈ సినిమాను పది రోజుల ముందుగానే విడుదల కానుంది.
దేశవ్యాప్తంగా ఉన్న (హైదరాబాద్ ఏఎమ్‌బీ సహా) 9 ప్రధాన నగరాల్లో మేజర్ ప్రివ్యూ ప్రదర్శించనున్నారు. మే 24 నుంచి రోజుకో సెంటర్‌లలో రిలీజ్ కానుంది.
ఈ ప్రివ్యూలను హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగళూరు, ముంబై, పూణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో ప్రదర్శిస్తారు.ఇందుకోసం బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రివ్యూస్ చూడాలనుకునేవారు బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు.
అలాగే ఈ సినిమా టికెట్ రేట్లపై అడవి శేష్ ఇటీవల స్పందించాడు .. ప్రముఖ ఆన్‌లైన్ యాప్ బుక్ మై షోతో కలిసి మేము ఈ చిత్రాన్ని మీ ముందుకు తెస్తున్నాం. ‘బుక్‌మై షో’ యాప్‌లోకి వెళ్లి.. మీ ప్రాంతంలో ఎప్పుడు స్క్రీనింగ్ జరగనుందో చూసుకుని ప్రివ్యూలకు రిజిస్టర్ చేసుకోండి” అని శేష్ తెలిపారు.
అయితే, బుక్ మై షో యాప్‌లో ఇంకా ‘మేజర్’ ప్రివ్యూలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభం కాలేదు. యాప్‌లోకి లాంగినై.. ‘మేజర్’ అని సెర్చ్ చేసి.. సినిమాపై ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేయగానే.. “మేజర్ టికెట్లు రిలీజ్ చేసినప్పుడు మీకు రిమైండర్ మెస్సేజ్ పంపుతాం” అని యాప్‌లో చూపిస్తోంది.
కాగా..’టికెట్ రేట్లను తగ్గించండి. రిపీటెడ్‌గా సినిమా చూసేందుకు వీలుంటుంది. ఫలింతగా ఇండస్ట్రీని కాపాడొచ్చు.’ అని ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు శేష్ బదులిచ్చాడు. తమ సినిమా టికెట్లు సాధారణ రేట్లతో అందుబాటులో ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు. ‘ఇది సాధారణ ప్రేక్షకులు చూడాల్సిన అసాధారణ సినిమా’ అని పేర్కొన్నాడు.
చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్…