telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌లో హైడ్రామా : ఎస్పీ ఆఫీస్‌ నుంచి సర్ప‌వ‌రం పోలీస్ గెస్ట్ హౌస్‌కి అనంతబాబును తరలింపు

* డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌

*ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌లో హైడ్రామా

*డ్రైవ‌ర్ సుబ్రహ్మణ్యాన్ని తానే చంపాన‌ని అనంత‌బాబు అంగీకారం..
*ఎస్పీ ఆఫీస్ నుంచి భారీ బందోబ‌స్తు మ‌ధ్య అనంత‌బాబు త‌ర‌లింపు
*కాకినాడ ప్రభుత్వ ఆస్ప‌త్రి ఆనంత‌బాబును వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించారు.

డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు కాసేపట్లో అనంతబాబు ను  జడ్జి ముందుకు ప్రవేశపెట్టనున్నారు.

ప్రస్తుతం కోర్టు సమయం ముగియడంతో నిందితుడిని జడ్జి ఇంటికి తీసుకువెళ్లానున్నారు. ఇప్పటికే మండలి చైర్మన్‌తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా సమాచారం అందజేశారు.

ఎస్పీ ఆఫీస్‌ నుంచి అనంతబాబును తరలింపు వ్య‌వ‌హారంలో సస్పెన్ష్ కొన‌సాగుతుంది . మీడియా కంట ప‌డ‌కుండా పోలీసుల వాహ‌నంలో కాకుండా ప్రైవేటు వాహ‌నంలో పోలీసులు త‌రిలిస్తున్నారు. 

కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో  వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుప‌ర్చాల్సి ఉంది..కానీ అస్పత్రి కి తీకెళ్ళ‌కుండా సర్ప‌వ‌రం పోలీస్ గెస్ట్ హౌస్‌కి త‌ర‌లించారు. ఇంకా ప్రభుత్వాస్పత్రికి చేరుకోలేదు.

అక్క‌డ విచార‌ణ జ‌రిగిన త‌రువాత అనంత‌బాబును కాకినాడ  ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించ‌నున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

కాగా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తాను చంపినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related posts