telugu navyamedia
సినిమా వార్తలు

“ఐడియా” టెలికాం కంపెనీపై అడవి శేష్ ఫైర్

adivi-sesh

చిన్న సినిమాగా తెరకెక్కిన “గూఢచారి” బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు యువహీరో, దర్శకుడు అడవిశేష్. తాజాగా ఈ హీరో “ఐడియా” టెలికాం కంపెనీపై ఫైర్ అవుతూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాను విదేశాలకు వెళ్లే సమయంలో ఐడియా కంపనీ ఇంటర్నేషనల్ ప్యాక్ తో రీచార్జ్ చేయించుకున్నానని, కానీ విదేశాల్లో ఆ ప్యాక్ పనిచేయలేదని, ఈ విషయమై ఫిర్యాదు చేసినా ఐడియా కంపనీ తన డబ్బుని రీఫండ్ చేయలేదని, ఆ సంస్కారం కూడా లేదని విమర్శించారు. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదని, ఐడియా కంపనీ అనైతికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇక హైదరాబాద్ లో కాల్ క్వాలిటీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఐడియా ప్రతినిధుల స్పందన అధ్బుతంగా ఉందనీ.. వాళ్లకి కనీస పరిజ్ఞానం కూడా లేదని విమర్శించారు. దీనికి తోడు ప్రతీరోజు తనకు స్పామ్ కాల్స్ ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారణాల వలన తాను ఐడియా నెట్ వర్క్ నుండి మారిపోతున్నట్లు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈ హీరో “ఎవరు” అనే సినిమాలో నటిస్తున్నాడు.

Related posts