గోవా బ్యూటీ ఇలియానా హిప్, థైస్, బూబ్స్ అంటూ ప్రతి భాగాన్ని ఫోకస్ చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. “నేను బయట వారికి ఎలా కనపడుతున్నానోనని బాధ పడుతుండేదాన్ని. నా హిప్ చాలా వెడల్పుగా ఉంటాయని అనుకునేదాన్ని. నా తొడలు చాలా పెద్దవిగా అనిపించేవి. నా నడుము సన్నదిగా ఉండేది కాదని, నా వక్షోజాలు అనుకున్నంత పెద్దవి కావని, నా ఉదరం చదునుగా లేదని, నా వెనుకభాగం పెద్దదిగా ఉందని, నా భుజాలు బలహీనంగా ఉంటాయని, ముక్కు నేరుగా లేదని, పెదాలు అందంగా లేవని, నేను ఎత్తుగా లేనని బాధపడుతుండేదాన్ని. నేను స్మార్ట్‌గా, పర్ఫెక్ట్గా లేదని అనుకుంటుంండేదాన్ని. అయితే నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు. నాలోని ప్రతి మచ్చ, భయంను వదిలి నన్ను నేను మలుచుకున్నాను. నా అందం నాదే అని భావించాను. ప్రపంచం అందం అని అనుకునేదాని గురించి ఆలోచించి నేనెందుకు ఆగాలి. అందులో ఇమిడాలని నేను ఎందుకు ప్రయత్నించాలి అని ఆలోచించి ఆగాను. నాకు నేనుగా నిలబడ్డాను’’ అంటూ ఇలియానా షేర్ చేసిన మెసేజ్ నెట్టింట వైరల్ అవుతుంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడటం, సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుండటం ఇలియానాకు అలవాటే.
previous post