telugu navyamedia
సినిమా వార్తలు

సర్దుకుపోతేనే అవకాశం అన్నారు… హీరోయిన్ కామెంట్స్

Aditi Rao Hydari images

“చెలియా” సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ అదితీరావు హైదరి. “సమ్మోహనం” సినిమాతో భారీ విజయాన్ని అందుకుని తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగుతో పాటు తమిళంలోను ఆమెను వరుస అవకాశాలు వరిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించింది.”సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపులు వున్నాయి. ఒక సినిమా విషయంలో ‘సర్దుకుపోతే ఈ అవకాశం మీకు ఇస్తాము… లేదంటే మరొకరికి ఈ ఛాన్స్ వెళుతుంది. ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి” అన్నారు. అలా అవకాశాలను సంపాదించుకోవలసిన అవసరం నాకు లేదు. అందుకే నో చెప్పేసి ఆ ప్రాజెక్టును వదిలేశాను. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. మౌనంగా వుంటే ఆ మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకునే అవకాశం వుంది” అంటూ చెప్పుకొచ్చింది అదితి.

Related posts