telugu navyamedia
సినిమా వార్తలు

“సాహో”లో సల్మాన్… క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Saaho

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, సుజీత్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం “సాహో”. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ దాదాపు పూర్త‌య్యింది. ఇప్పటికే సినిమా ప్రమోషన్లను ప్రారంభించారు. అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్‌ఖాన్ కీల‌క పాత్ర‌లోన‌టిస్తాడ‌ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై చిత్ర దర్శకుడు సుజీత్ స్పందిస్తూ… “ఈ సినిమా షూటింగును పూర్తి చేసేశాము. అతిథి పాత్ర కోసం సల్మాన్ ను సంప్రదిస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అసలు అలాంటి పాత్ర ఏది ఈ సినిమాలో కనిపించదు” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. యు.వి.క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Related posts