telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రావణి సూసైడ్ : సీన్ రీకంస్ట్రక్షన్… నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Shravani

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి (26) ఆత్మహత్య కేసుతో సంబంధం ఉన్న దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తుల వేధింపులతో ఒత్తిడికి గురైన నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఏ1 సాయికృష్ణ, ఏ2 దేవరాజు, ఏ3 నేరస్తుడిగా ఉన్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఇద్దరు నిందితులు సాయి కృష్ణ, దేవరాజ్ లను మూడు రోజుల పాటు కస్టడిలోకి తీసుకున్నారు పోలీసులు. ఈరోజు ఎస్సార్ నగర్ పోలీసులు సీన్ రీకన్ స్ర్టక్షన్ చేయనున్నట్టు తెలుస్తోంది. శ్రావణి ఆత్మహత్య కు ముందు శ్రీకన్య హోటల్ లో సాయి కృష్ణ రెడ్డి, దేవ రాజ్, శ్రావణి ల మద్య గొడవ జరిగింది. ఆత్మహత్య కు ముందు ముగ్గురి సెల్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేయనున్నారు. కేసులో లభించిన ఆడియోలు, వీడియోల ఆధారంగా ఇద్దరు నిందితులను విచారించి వారి ద్వారా వచ్చే సమాచారాన్ని స్టేట్ మెంట్ రూపంలో చార్జిషీట్లో పొందు పరచనున్నారు పోలీసులు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

Related posts