telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మోడీ విజయాన్ని పకోడీలతో సెలెబ్రేట్ చేసుకున్న కంగనా

Kangana

బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్ మొన్నటివరకూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హొయలొలికించి, ఇండియాకు తిరిగి వచ్చేసింది. వస్తూనే బీజేపీ సాధించిన ఘన విజయాన్ని సరికొత్తగా సెలబ్రేట్ చేసుకుంది. బీజేపీ విజయకేతనం ఎగరవేయడంతో కంగనా వంటగదిలోకి వెళ్ళి, స్వయంగా పకోడీలు చేసిందట. ఈ విషయాన్ని ఆమె సోదరి రంగోలీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ, కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. కంగనా ఎంతో అరుదుగా మాత్రమే వంట చేస్తుందని, ఆమె చాలా సంతోషంగా ఉంటేనే గరిట పడుతుందని చెప్పుకొచ్చింది రంగోలీ. రుచికరమైన పకోడీలు చేసి, వాటితో పాటు కాఫీని తమకందించిందని చెప్పింది. “జై హింద్‌.. జై భారత్‌” అన్న క్యాప్షన్ పెట్టి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related posts