telugu navyamedia
సినిమా వార్తలు

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ కు అస్వస్థత

Kalki

యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ “కల్కి”. అదా శర్మ, నందితా శ్వేత నాయికలు. పూజితా పొన్నాడ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించగా… స్కార్లెట్‌ విల్సన్‌ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. శివానీ, శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్‌ నిర్మించారు. కె.కె. రాధామోహన్‌ పంపిణీ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. 1983 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇదొక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. తాజాగా “కల్కి” మూవీ సెన్సార్ పూర్తి అయింది. ఈ చిత్రాన్ని వీక్షించిన సెన్సార్ బోర్డు యు/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది.

అయితే తాజాగా రాజశేఖర్ అస్వస్థతకి గురైనట్లు సమాచారం. దాని కారణంగా ఈరోజు సాయంత్రం జరగాల్సిన “కల్కి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా క్యాన్సిల్ చేయడానికి అదే కారణమని తెలుస్తోంది. ఒత్తిడి పెరగడంతో నిన్నటి నుండి జ్వరంతో బాధ పడుతున్నారు రాజశేఖర్. ఈరోజు కాస్త కోలుకున్నట్లు సమాచారం. జ్వరం తగ్గితే సాయంత్రం నుండి “కల్కి” సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటారు. లేదంటే వాటిని కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇటీవల ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదల కాగా, సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.

Related posts