telugu navyamedia
సినిమా వార్తలు

కేఏ పాల్‌ బయోపిక్… హీరోగా సునీల్

KA-Paul-and-Sunil

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికలలో తెరపైకి వచ్చిన కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఎన్నికలలో ఆయన ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. ఎన్నికల సమయంలో కేఏ పాల్ తన హడావుడితో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యారు. ఇక ఆయనకు క్రైస్తవ మత ప్ర‌చార‌కుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఆయ‌న జీవిత‌క‌థ ఆధారంగా ఓ బ‌యోపిక్ తెర‌కెక్క‌బోతున్న‌ట్టు వార్తలు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఈ దిశ‌గా ఏర్పాట్లు చేస్తోంద‌ని, కేఏ పాల్ పాత్ర‌లో సునీల్ న‌టిస్తాడ‌ని, ఈ సినిమాను ఓ కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా హాస్య ప్రధానంగా పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ పాత్ర‌కు సునీల్ అయితేనే స‌రిగ్గా స‌రిపోతాడ‌ని నిర్మాత భావిస్తున్నార‌ట‌. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే.

Related posts