telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అభిషేక్ బచ్చన్ సర్‌ప్రైజ్ .. నాలుక కరుచుకున్న నెటిజన్లు..

Abhishek

సాధారణంగా సామజిక మాధ్యమాలలో సెలెబ్రిటీలపై ఎక్కువ ముచ్చట్లు హాల్ చల్ చేస్తూనే ఉంటాయి. అయితే కొందరు సరదాగా అంటే మరి కొందరు మాత్రం కావాలనే టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడతారు. తాజాగా అభిషేక్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్‌పై భిన్న రకాలు కామెంట్స్ చేశారు నెటిజన్లు. హే గాయ్స్.. మీ అందరి కోసం సర్‌ప్రైజ్.. చూస్తూనే ఉండండి.. అంటూ ట్వీట్ చేశాడు. ఇక అంతే నెటిజన్లు తమ తెలివికి, చమత్కారానికి, కొంటెదనానికి, ప్రతిభకు ఇలా అన్నింటికి పదును పెట్టారు. అందులో కొందరు బచ్చన్ ఫ్యామిలీ వ్యక్తిగత విషయాలను కూడా టచ్ చేశారు. సర్‌ప్రైజ్ అంటూ అభిషేక్ బచ్చన్ చేసిన ఈ ట్వీట్‌కు నిజంగానే సర్‌ప్రైజింగ్ రిప్లైలు వచ్చాయి. కొన్ని రాజకీయ నేపథ్యంలో తగలగా, మరి కొన్ని రాబోయే ప్రాజెక్ట్‌ల విషయమై ఉంటుందని కామెంట్లు చేయగా.. మరి కొందరు ఐశ్వర్యారాయ్‌ ప్రెగ్నెన్సీపై పడిపోయారు.

మీరు మరోసారి తండ్రి కాబోతోన్నారా? ఐశ్వర్యా తల్లి కాబోతోందా? జూనియర్ బచ్చన్ రాబోతోన్నాడా? అంటూ ఇలా పలు రకాల కామెంట్స్ చేస్తు వచ్చారు. మధ్యలో ఓ నెటిజన్ ఫైర్ అవుతూ..ఐశ్వర్యకు ఇప్పుడు 46.. కాస్త కామన్‌సెన్స్ పెట్టి ఆలోచించండి అంటూ ట్వీట్ చేశాడు. అయితే అభిషేక్ పెట్టిన ఆ సర్‌ప్రైజ్ ట్వీట్.. అమితాబ్ నటించిన జుంద్ టీజర్ గురించి అని కొందరు కనిపెట్టారు. అందులో కొంతమందికి అభిషేక్ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ ట్వీట్ పెట్టిన కాసేపటికే జుంద్ టీజర్‌కూ పోస్ట్ చేశాడు. కానీ ఆ కొద్ది సమయంలోనే నెటిజన్ల కామెంట్లు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.

Related posts