telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెటిజన్ కు నందు స్ట్రాంగ్ కౌంటర్

BBB

ఇటీవలే “సవారి” అనే వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నందు. ప్రస్తుతం “బొమ్మ బ్లాక్ బస్టర్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు విరాఠ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నిన్న నందు పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసి ఆయననకు శుభాకాంక్షలు తెలిపారు చిత్రయూనిట్. అందులో జమీందార్ లా ఒళ్లంతా బంగారు ఆభరణాలు ఖరీదైన కాస్ట్యూమ్ తో కనిపిస్తున్నాడు. అయితే ఆ పోస్టర్ ను నందు కూడా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దానికి ఓ నెటిజన్ ”సినిమా డైరెక్ట్ గా విడుదల చెయ్.. చూసి చస్తాం… ఏదో పెద్ద సూపర్ స్టార్ ల అప్డేట్ పోస్ట్ ఎందు, టైం బొక్క” అని కామెంట్ పెట్టాడు. ఇది చూసిన నందు అతనికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఆ కామెంట్ పై నందు స్పందిస్తూ…”మళ్ళీ నీలాంటోడే వచ్చి నెపోటిజం, తొక్క బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి సప్పోర్ట్ చేయాలి అని పోస్ట్ లు పెడుతుంటాడు. సూసైడ్ చేసుకుంటే తప్ప బ్యాగ్రౌండ్ లేనివాడికి సపోర్ట్ చేయని మీలాంటి బ్యాచ్ కు దండం. అయినా నేను స్టార్ అని ఎప్పుడూ చెప్పుకోలేదు. నువ్వే ఇండైరెక్ట్ గా తలిగిస్తున్నావ్” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Related posts