telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాల‌కృష్ణ హీరో… ఆయ‌నంటే ప్ర‌త్యేక గౌరవం… : నాగబాబు

Nagababu

గత కొన్ని రోజుల నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు మధ్య వార్ నడుస్తున్న విషయం తెలి‌సిందే. తాజాగా ఇదే ఇష్యూపై స్పందించిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. బాల‌కృష్ణ‌తో నాకెలాంటి విభేదాలు లేవ‌ని, ఆయ‌నంటే ప్ర‌త్యేక గౌరవం ఉంద‌ని ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు. “బాల‌కృష్ణ గారిని నేను టార్గెట్ చేయ‌లేదు. ఆయ‌న మాట్లాడింది త‌ప్ప‌ని చెప్పాను. ఆయ‌న‌తో నాకెలాంటి శ‌తృత్వం లేదు. బాల‌కృష్ణ హీరో. నేను చిరంజీవి బ్ర‌ద‌ర్‌ని, అదీ కాక ఓ నిర్మాత‌ని. మా ఇద్ద‌రికి పొంత‌న లేదు. ఆయ‌న‌తో నేను స‌మానం అని చెప్పుకోను. బాల‌కృష్ణ గారితో పెద్దగా ప‌రిచ‌యం కూడా నాకు లేదు. ఏదో హ‌లో అంటే హ‌లో అన‌డం త‌ప్ప‌. బాల‌య్య మాట‌ల‌ని ఖండించాను త‌ప్ప ప్ర‌త్యేకంగా ఆయ‌న‌తో ఎలాంటి శ‌తృత్వం లేదు. ఆయ‌న కూడా తాను మాట్లాడిన మేట‌ర్‌లో రియ‌లైజ్ అయ్యారు. ఆ మాట ఎవరు మాట్లాడిన కూడా నేను ఇలానే స్పందించే వాడిని. ఇండ‌స్ట్రీలో ఏ గొడ‌వ జ‌రిగిన మీడియా ఏదో మూడో ప్ర‌పంచ యుద్ధం జ‌రిగిన‌ట్టు పెద్ద‌దిగా చూపిస్తుంది. మా గొడవలు అన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటివి” అంటూ వివాదానికి పులిస్టాప్ పెట్టారు నాగబాబు. జూన్ 9న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు జ‌గ‌న్‌ని క‌ల‌వ‌నున్న నేప‌థ్యంలో బాల‌కృష్ణ కూడా వారితో జ‌త క‌డ‌తారా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

Related posts