‘బిగ్ బాస్’ సీజన్ 3లో పునర్నవికి ఎక్కడలేని పాపులారిటీ వచ్చేసింది. ముఖ్యంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమెస్నేహం ‘బిగ్ బాస్’ షోకే ఒక క్రేజ్ తీసుకొచ్చింది. కెమిస్ట్రీ వర్కవుట్ అవడంతో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ పుకార్లు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై పునర్నవి నోరు విప్పింది. రాహుల్, తాను మంచి స్నేహితులమని, ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరొకటి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఇటీవలే ఓ పబ్ లో పునర్నవిపై కామెంట్లు చేసిన వారిపై రాహుల్ సిప్లిగంజ్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారన్న విషయాన్ని కొట్టిపారేసింది. తాను ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పిన పునర్నవి… ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటపడుతున్నట్లు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.