మెగా డాటర్ నిహారిక పెళ్ళి విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిహారిక పెళ్లి గురించి ఇటీవల ఆమె తండ్రి నాగబాబు మాట్లాడిన సంగతి తెలిసిందే. నిహారికకు త్వరలో పెళ్లి చేసేస్తామని, వచ్చే ఏడాది నిహారిక పెళ్లి ఉంటుందని అన్నారు. అయితే తాజాగా నిహారిక తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ నెటిజన్లలో ఆసక్తిని కలిగిస్తోంది. స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నీహ’ అని రాసి ఉండగా.. దానిలో ‘మిస్’ను కొట్టేసి కింద ‘మిసెస్’ అని రాసి క్వశ్చన్ మార్క్ పెట్టింది నిహారిక. దాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి ‘ఉహ్.. వాట్?’ అని కామెంట్ చేసింది. దీంతో నిహారిక పెళ్లి గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. నిహారిక పెళ్లి సెటిల్ అయిపోయిందని అనుకుంటున్నారు. కొందరు ఆమెకు కంగ్రాట్స్ కూడా చెప్పేశారు. మరికొన్ని రోజులు ఆగితే కానీ నిహారిక పెళ్ళి విషయం తేలేలా లేదు.
previous post
ఇన్స్టెంట్ స్టోరీలు, డైలాగ్స్ వద్దు…టాలీవుడ్ డైరెక్టర్స్‌కి చిరు మందలింపు