telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

రేపటి నుంచి వైన్ షాపులు ఓపెన్..రెడ్ జోన్లలో నిబంధనలు!

liquor shop sales

దేశవ్యాప్తంగా రేపటి నుంచి మూడో విడత లాక్ డౌన్ ను కొనసాగిస్తూ కేంద్రం కొన్ని మినహాయింపులను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలపై కేంద్రం మరింత స్పష్టతను ఇచ్చింది. రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్లన్నింటిలో మద్యం విక్రయాలు కొనసాగించ వచ్చని స్పష్టం చేస్తూ, రెడ్ జోన్ల విషయంలో పరిమితులను విధించింది. కేవలం మద్యం విక్రయాలు మాత్రమే సాగాలని సూచించింది.

పర్మిట్ రూముల నిర్వహణకు అనుమతి లేదని స్పష్టం చేసింది. మాల్స్ లో ఉండే మద్యం రిటైల్ దుకాణాలకు అనుమతి లేదని పేర్కొంది. దుకాణాల మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరని, ఏ దుకాణం వద్ద కూడా అయిదుగురికి మించి ఉండరాదని పేర్కొంది. మార్కెట్ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు తెరిచేందుకు వీల్లేదని వెల్లడించింది.

Related posts