ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ జగన్ శక్తి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. సమాచారం ప్రకారం జగన్ శక్తి మెదడులోని రక్తం గడ్డ కట్టింది. ఈ నేపధ్యంలో ఆయన ఆరోగ్యం విషమించిందని సమాచారం. ప్రస్తుతం జగన్ శక్తికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. జగన్ శక్తి ఆరోగ్యం విషమించిన నేపధ్యంలో ఆయన కుటుంబ సభ్యులంతా ముంబైకి చేరుకున్నారు. జగన్ శక్తి తన స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో ఉన్నట్టుండి కింద పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో జగన్ శక్తికి మెదడులో రక్తం గడ్డకట్టిందని వెల్లడయ్యింది. జగన్ శక్తి దర్శకత్వంలో 2019లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘మిషన్ మంగళ్’ సినిమా తెరకెక్కి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీనికి ముందు ఆయన ‘చీనీ కమ్’తో పాటు పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ‘మిషన్ మంగళ్’ తరువాత జగన్ శక్తి తన తదుపరి సినిమా కోసం హీరో అక్షయ్‌కుమార్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలా అనారోగ్యం పాలయ్యారు.

