telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధానిపై ప్రజలు నిరసనలు చేస్తే తప్పా?: గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

రాజధానిపై రైతులు చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్, సెక్షన్ 30.. తొలగించాలని డిమాండ్ చేశారు. నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్రమించిన హక్కు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యంలో చట్ట బద్ధంగా భావ ప్రకటన చేసే హక్కు ఉందంటూ.. అటువంటి సందర్భాల్లో వీటిని విధించకూడదని, సుప్రీంకోర్టు తెలిపిందంటూ దానికి సంబంధించిన క్లిప్పింగ్ లను కూడా ఆయన పోస్ట్ చేశారు. ‘సెక్షన్ 144, సెక్షన్ 30.. తదితర సెక్షన్లను వెంటన్ ఎత్తివేయాలి. ఇవి ప్రజాస్వామ్యయుతంగా చేపడుతున్న నిరసనలను నిరోధిస్తున్నాయి. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రజలకు ఉందని పేర్కొన్నారు.

Related posts