telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

దాదాపు ఐదు లక్షల కోట్ల బడ్జెట్ .. ప్రవేశపెట్టిన యోగి..

Mamatha Break Yogi Rali West Bengal

యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో 4.79 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి రాజేశ్‌ అగర్వాల్‌ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఏడాదితో పోలిస్తే 12 శాతం ఎక్కువ. గోరఖ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌వే కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. కన్యా సుమన్‌ యోజన కోసం 1200 కోట్లు, స్మార్ట్‌ సిటి ప్రాజెక్టు కోసం 758 కోట్లు కేటాయించారు.

విమానాశ్రయాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లు, పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం 1194 కోట్లు, బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కోసం వెయ్యి కోట్లు కేటాయించారు. అయోధ్యలో నిర్మించబోయే ఎయిర్‌పోర్ట్‌కు 200 కోట్లు ప్రకటించారు. అరబిక్‌-పర్షియన్‌ భాషల ఆధునీకరణ కోసం 459 కోట్లు కేటాయించారు. గోశాలల కోసం సుమారు 650 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే రైల్వేపై అత్యధిక శ్రద్ధ చూపినట్లు విదితమవుతుంది.

Related posts