telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

పని చేసిన ఇంట్లోనే దొంగతనానికి వెళ్లిన వ్యక్తి… ఇంట్లో ఆమె ఒక్కతే ఉండడంతో…!

Jail

పాకిస్థాన్‌కు చెందిన నిందితుడు కొంతకాలం క్రితం పనిచేసిన విల్లాలోనే కన్నం వేయాలని ప్లాన్ వేశాడు. ఇంటి బయట ఫెన్సింగ్‌‌ను తొలగించి విల్లాలోకి దూరాడు. ఇంతకు ముందు అక్కడే పనిచేసిన వాడు కావడంతో.. నిందితుడిని చూసిన పనిమనిషి వెంటనే కనిపెట్టేసింది. ఇదే సమయంలో నిందితుడు పనిమనిషిని గట్టిగా డ్రిల్లర్‌తో తలపై కొట్టాడు. ఆమె అరవకుండా నోట్లో గుడ్డ కుక్కాడు. అయితే ఈ ఘటనలో పనిమనిషి ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో ఇంట్లో పనిమనిషి తప్ప మరెవరూ లేనట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో తాను తన భార్యతో కలిసి ఓ హోటల్‌లో ఉన్నట్టు యజమాని పోలీసులకు వివరించాడు. ఇదిలా ఉండగా.. తాను పనిమనిషిని ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అరవకూడదనే కొట్టానని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నాడు. నిందితుడిపై దొంగతనం, హత్య తదితర కేసులను పోలీసులు నమోదు చేశారు. కేసు కోర్టుకు వెళ్లగా జడ్జి 25 ఏళ్ల జైలుశిక్ష విధించి.. అనంతరం నిందితుడిని దేశం నుంచి బహిష్కరించాలంటూ తీర్పునిచ్చారు. దుబాయిలోని అల్ బార్షాలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

Related posts