ప్రజలు వైద్యురాలి హత్యకేసు నిందితులకు ఉరిశిక్ష వేయాలంటూ చేస్తున్న ఆందోళనలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఆదివారం సాక్షాత్తూ చర్లపల్లి జైలు వద్దే యువకులు, ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి యువకులు, ప్రజలు బైక్ ర్యాలీగా చర్లపల్లి జైలు వద్దకు వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. జైలు గేటు ముందు కూర్చొని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. దీంతో జైలు వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
శనివారం కూడా షాద్‌నగర్ పీఎస్ వద్దకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి నిందితులకు ఉరిశిక్ష వేయాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
గవర్నర్తో అబద్దాలు చెప్పించారు: రాజాసింగ్